టీఆర్ఎస్ లేకపోతే ఈటల ఎక్కడ ఉండేవాడు.. మంత్రి గంగుల కామెంట్స్..!

Saturday, May 15th, 2021, 01:52:32 AM IST

భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్‌కు వరుస షాక్‌లు తగులుగుతున్నాయి. సొంత నియోజకవర్గంలో ముఖ్య నేతలంతా టీఆర్ఎస్ వెంటే తాము ఉంటామని ఈటల వెంట నడిచే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈటల రాజేందర్‌పై మంత్రి గంగుల కమలాకర్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ లేకుంటే అసలు ఈటల ఎక్కడ ఉండేవాడని గంగుల ప్రశ్నించారు.

అంతేకాదు ఈటల తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని, 20 సంవత్సరాలుగా అనేక పదవులు అనుభవించి కన్న తల్లి లాంటి పార్టీని విమర్శిస్తున్నాడని అన్నారు. ఎంతో ప్రజాధరణ ఉన్న టీఆర్ఎస్ పార్టీనీ ఈటల కూల్చేందుకు కుట్రపన్నారని, పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదని వ్యవస్థే ముఖ్యమని అన్నారు. కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, రైతుబంధు పథకాల గురించి అవహేళన చేసి మాట్లాడాడని, ఇప్పుడు పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నాడని మంత్రి గంగుల చెప్పుకొచ్చారు.