బిగ్ న్యూస్: టీడీపీ వాళ్ళు ఇప్పటివరకు మూడు బిల్లులు అడ్డుకున్నారు!

Friday, January 24th, 2020, 05:56:32 PM IST

తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటివరకు మూడు బిల్లులు అడ్డుకున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు ఆరోపించారు. ఎస్సి, ఎస్టీ ప్రత్యేక బిల్లుని వారి ప్రయోజనాల కోసం తీసుకొస్తే అడ్డుకుందని, పేదలకు చదువుని ఆంగ్ల మాధ్యమం లో అందించేందుకు తీసుకొచ్చిన బిల్లుని అడ్డుకుందని అన్నారు. తాజాగా మొన్న శాసన మండలి ద్వారా సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుని అడ్డుకుందని అన్నారు. అయితే మీడియా తో మాట్లాడిన మంత్రి కన్నబాబు టీడీపీ ఎమ్మెల్సీ నేతల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధి తెలుగు దేశం పార్టీ కి ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. నాలుగు రోజులు ఆలస్యం అయినా విశాఖ నుండే పాలన కొనసాగుతుందని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా విశాఖ, లెజిస్లేటివ్ కాపిటల్ గా అమరావతి, జ్యూడిషియల్ క్యాపిటల్ గా కర్నూల్ ఉండగా, బిల్లుని అడ్డుకున్నారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే కన్నబాబు చేసిన వ్యాఖ్యల ఫై నెటిజన్లు భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.