నారా లోకేష్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంత్రి కన్నబాబు!

Friday, February 14th, 2020, 10:26:27 PM IST

ఐటీ దాడుల ఫై వైసీపీ, టీడీపీ నేతలు ఒకరి ఫై ఒకరు దారుణ విమర్శలు చేస్తున్నారు. అయితే కొండని తవ్వి ఎలుకని పట్టుకున్న చందాన అని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు గానూ, మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు. ఏమీ తవ్వకుండానే ఎలుకలు దొరికాయని, కరెక్టుగా తవ్వితే ఏనుగులు దొరుకుతాయని మంత్రి కన్నబాబు నారా లోకేష్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అవినీతికి అంతూపొంతూ లేదని చెప్పడానికి తాజాగా జరిగిన ఐటీ దాడులే ఉదాహరణ అని అన్నారు.

చంద్రబాబు మాజీ పీఎస్ దగ్గర రెండు వేల కోట్లు ఉన్నట్లు ఐటీ శాఖ నోట్ విడుదల చేసిన విషయాన్ని మీడియా తో తెలియజేసారు. తక్కువే పట్టుకున్నారు, మా దగ్గర చాలానే ఉంది అన్న చందాన నారా లోకేష్ ట్వీట్ ఉందని అన్నారు. కంగారు పడొద్దు, ఇల్లు అలకగానే పండుగకాదు, ఇపుడే మొదలైంది, మీ బాగోతాలు, మీ కథలు బయటికొస్తాయని కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికారం వచ్చినప్పటినుండి స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు పనిచేశారని ఆరోపించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో స్వప్రయోజనాల కోసమే పని చేసారని అన్నారు. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ తెచ్చుకున్నారని ఆరోపించారు. లోతుగా దర్యాప్తు చేస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేసారు.