కరోనా వ్యాధికి ఖచ్చితమైన మందులు ఇంకా రాలేదు!

Tuesday, July 28th, 2020, 01:46:46 AM IST


దేశ ప్రజలు అందరూ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో సైతం రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మృతుల సంఖ్య సైతం రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది అని, అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా అని అన్నారు. కరోనా వైరస్ విషయం లో ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని అన్నారు. భౌతిక దూరం పాటించండి అని, మాస్క్ లను ధరించండి అని అన్నారు. ఇళ్ల నుండి బయటికి రావొద్దు అని, గుంపులుగా బయట తిరగొద్దు అని అన్నారు. కరోనా వ్యాధికి ఖచ్చితమైన మందులు ఇంకా రాలేదు అని స్పష్టం చేశారు. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవడమే ఖచ్చితమైన మార్గం అని సూచించారు. అయితే కేసుల పెరుగుదల కారణంగా దేశం లో ఆర్ధిక ఇబ్బందులు కూడా తలెత్తుతున్న కారణంగా అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలి కోరారు.