టీడీపీ నేతలపై మండిపడుతున్న మంత్రి కొడాలి నాని – మరీ ఇంత దారుణంగానా…?

Sunday, November 17th, 2019, 02:40:19 AM IST

వైసీపీ మంత్రి కొడాలి నాని ఏపీలోని టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కాగా చెప్పాలంటే టీడీపీ నేతలను టార్గెట్ గా చేసుకొని మరీ చాలా అదారుణంగా తిట్ల దండకాన్ని మొదలెట్టారు మంత్రి కొడాలి నాని… కాగా ఇటీవల టీడీపీ పార్టీని వీడిన వల్లభనేని వంశీ మొదలెట్టిన ఈ తిట్ల దండకాన్ని ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఇకపోతే టీడీపీ నేతలు అందరు కూడా కట్టగట్టుకొని మరీ వైసీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అనవసరంగా వైసీపీ నేతలను రెచ్చగొడుతున్నారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపోతే రాష్ట్రంలో అందరికి సన్నబియ్యం పంచుతామని మాట ఇచ్చి, ఇప్పుడు మేము మాట మార్చేశామని, అంతేకాకుండా సన్యాసి సన్నబియ్యం ఇస్తానని చెప్పాడని తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తాను ఎవరికి చెప్పానని ఉమాను ప్రశ్నించారు. అయితే ప్రజలకు బియ్యం పంచాలంటే, ఆ బియ్యాన్ని కొనుగోలు చేయాల్సి వస్తూండనై, కానీ ప్రస్తుతానికి ఈ నెలాఖరు వరకు బియ్యం చేతికి వస్తుందని, కనీసం అదికూడా తెలియని వారు ప్రజలను పాలించడానికి పనికి రారని కొడాలి నాని ఆరోపించారు. ఇకపోతే ఇంకొకసారి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ, మమ్మల్ని రెచ్చగొడితే దేహశుద్ది చేస్తామని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.