మానవత్వం చాటుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్.. రియల్లీ గ్రేట్..!

Friday, February 14th, 2020, 11:59:18 PM IST

టీఆర్ఎస్ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. రోడ్దు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని మంత్రి కొప్పుల ఈశ్వర్ తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఈ ఘటన చేసుకుంది. ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కొమ్మ భూమయ్య చొప్పదండి-ఆర్నికొండ మార్గంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

అయితే తీవ్ర గాయాలతో రక్తస్రావం కావడంతో ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అటుగా వెళ్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్ద మనసుతో గాయపడిన వ్యక్తికి నీళ్ళు తాగించి, తన కాన్వాయ్‌లోనే ఆ వ్యక్తిని కరీంగనర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయన వివరాలు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అయితే మంత్రి చేసిన సహాయానికి వారి కుటుంబ సభ్యులు, ఆ గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియచేశారు.