మంత్రి కేటీఆర్ మరొక కీలక నిర్ణయం – నగర వాసులకు పండగే ఇక…

Wednesday, February 12th, 2020, 10:50:35 PM IST

రాష్ట్రానికి ఐటీ శాఖా మంత్రిత్వ బాధ్యతలను తీసుకున్నటువంటి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్పటికే తన కీలకమైన నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన సత్తా ఏంటో మొత్తం రాష్ట్ర ప్రజలందరికి తెలిసేలా చేసిన మంత్రి కేటీఆర్ తాజాగా మరొక కీలకమైననిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. కాగా హైదరాబాద్ నగర ప్రజలందరికి కూడా మంత్రి కేటీఆర్ ఒక శుభవార్త చెప్పారు. కాగా నగరంలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బస్తీ దవాఖానాల సంఖ్య పెంచనున్నామని వెల్లడించారు. ఈ మేరకు నగరంలో మరో 227 బస్తీ దవాఖానాలని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు.

కాగా ఇప్పటికే నగరంలో పేదల కోసమని 123 బస్తీ దవాఖానాలు మాత్రమే ఉన్నాయి. తాజాగా మరొక 227 దవాఖానాలు పెంచనున్నామని, రానున్న మూడు నెలల్లోనే ఈ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఈ మేరకు మాట్లాడిన మంత్రి కేటీఆర్ ఇక నుండి ప్రజల ఆరోగ్యం విషయంలో మరింతగా జాగ్రత్తలు తీసుకుంటామని, ఈ దవాఖానాల్లో సరైన వసతులన్నీ సమకూరుస్తున్నామని వెల్లడించారు.