తెలంగాణ లాక్ డౌన్ : హోమ్ డెలివరీ పై మంత్రి కేటీఆర్ ఏమంటున్నారంటే…?

Wednesday, March 25th, 2020, 07:27:19 AM IST

మహమ్మారి కరోనా వైరస్ భయంకరంగా వ్యాపిస్తున్న తరుణంలో వచ్చే నెల 14 వరకు కూడా దేశ వ్యాప్తంగా ఒకరకమైన కర్ఫ్యూ కి పిలుపునిచ్చారు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ 21 రోజులు కూడా ప్రజలందరూ తమ ఇళ్లల్లో నుండి ఎవరు కూడా బయటకు రావొద్దని, దీనికి అందరూ కూడా సహకరించాలని, ఇలా చేస్తేనే మనమందరం కూడా ఆ మహమ్మారి కరోనా భారిన పడకుండా కాపాడుకోగలమని ప్రధాని మోడీ వెల్లడించారు. అయితే ఇలాంటి పరిస్థితులలో ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఆన్‌లైన్ ఈ-కామర్స్ లాంటి హోమ్ డెలివరీ సర్వీసులు కూడా మూసేసారు. అయితే అందువలన ప్రజలందరూ కూడా తమకు కావాల్సిన సరుకుల కోసం షాపుల దగ్గరకు వెళ్లాల్సిందే.

అయితే ఈ నేపథ్యంలో ఒక నెటిజన్, ప్రధాని పిలుపు మేరకు తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా ఒక పోస్టు పెట్టారు. మీరు ఇలా చేస్తే మాకు నిత్యావసరాల సరుకులు రావడం కష్టతరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఒక పోస్టు ని మంత్రి కేటీఆర్ కి ట్యాగ్ చేశారు. కాగా ఈ ట్వీట్ పై స్పందించిన మంత్రి కేటీఆర్… “ఆల్రెడీ బిగ్ బాస్కెట్, గ్రోఫెర్స్, అమెజాన్ లాంటి సంస్థలు తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేలా చెయ్యమని తన ఐటీ సెక్రెటరీ జయేష్ రంజన్‌ను ఆదేశించినట్లు తెలిపారు. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఒకట్రెండు రోజుల్లో… ఆన్‌లైన్‌లోనే నిత్యవసరాలు కొనుక్కునే ఛాన్స్ రావచ్చని పోస్టు పెట్టారు…”

అంతేకాకుండా సామాన్లు కొనుక్కోకుండా ఎవరు కూడా ఉండలేరని, కానీ ప్రభుత్వ నిబంధనలను చూసుకుంటూ, అత్యవసరమైన, నిత్యవసరమైన సరుకులు, వస్తువులు తెచ్చుకోవచ్చని, కానీ కేవలం నిముషాల వ్యవధిలోనే ఈ సరుకులు తెచ్చుకోవాలని, లేని యెడల చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇకపోతే లాక్ డౌన్ టైమ్ మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది అని, దీనికి ఈ 21 రోజులు అందరు కూడా సహకరిస్తేనే దేశం అంత కూడా బాగుపడుతుందని, అందుకనే ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.