మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కేటీఆర్ – ఆపదలో ఉన్న ఆంధ్ర చెల్లికి అండ…?

Wednesday, March 25th, 2020, 02:41:24 PM IST


తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్, తెలంగాణ రాష్ట్రాభివృద్ధి విషయంలో ఇప్పటికే ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. కాగా తాజాగా ఆపదలో ఉన్న ఒక అమ్మాయికి అండగా నిలవడానికి ముందుకొచ్చాడు మన మంత్రి కేటీఆర్.,కాగా వివరాల్లోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక యువతి, పొట్టకూటికోసమని హైదరాబాద్ కి వచ్చి ఉద్యోగం కోసమని తిరిగి, చివరకి ఇంటికే వెళ్లిపోదామనుకునే తరుణంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఆమె ఎటూ వెళ్లలేని పరిస్థితిలో పడిపోయింది. చివరికి చేతిలో డబ్బులు లేక, తినడానికి తిండి లేక చివరికి నిస్సహాయురాలిగా మారిపోయింది.

దీంతో చేసేదేమి లేక ఆ యువతి మంత్రి కేటీఆర్ కి తన బాధను ట్విట్టర్ వేదిక ద్వారా వెళ్లబోసుకుంది. రెండ్రోజులుగా తనకు తినడానికి తిండి లేదని, దయచేసి సొంతూరుకు వెళ్లడానికి సాయం చేయాలని కోరగా, ఆ యువతి పోస్టు పై స్పందించిన మంత్రి కేటీఆర్… “చెల్లెమ్మా! ఆందోళన చెందకు. మా బృందం నీకు సహాయం అందిస్తుంది” అని అభయం ఇచ్చారు మంత్రి కేటీఆర్… దానికి తోడు ఆ పోస్టు చూసిన వారందరు కూడా ఆ యువతికి మద్దతు పలుకుతున్నారు. ఇకపోతే మంత్రి కేటీఆర్ వ్యక్తిత్వానికి ప్రజలందరూ కూడా ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.