మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ.. అనుమానాలుంటే చెక్ చేసుకోండి..!

Friday, February 26th, 2021, 01:57:29 AM IST


తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి కేటీఆర్ చెప్పడంతో దీనిపై ప్రతిపక్షాల నుంచి సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ నేపధ్యంలో మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ యువతను గందరగోళానికి గురిచేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. అయితే 2014 నుంచి 2020 మధ్య భర్తీ చేసిన 1,32,899 ఉద్యోగాల వివరాలను శాఖల వారిగా ప్రకటన చేశానని దీనిపై ఎవరికైనా అనుమానాలుంటే ఆ శాఖతో ధృవీకరించుకోవాలని అన్నారు.

శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు

1) తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – 30,594
2) తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ – 31,972
3) తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు – 3,623
4) జూనియర్ పంచాయతీ సెక్రెటరీస్ – 9,355
5) సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ – 12,500
6) విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ – 22,637
7) 15. జెన్‌కో, ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్, ఎస్ పి డి సి ఎల్ – 6,648
8) ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ-హైదరాబాద్ – 179
9) శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ-హైదరాబాద్ – 80
10) డైరెక్టర్, మైనారిటీస్ వెల్ఫేర్ – 66
11) డిపార్ట్‌మెంట్ అఫ్ ఆయుష్ – 171
12) టీఎస్ జెన్ కో- 856
13) టీఎస్ ఎన్పీడీసీఎల్ – 164
14) టీఎస్ ఎస్పీడీసీఎల్ – 201
15) టీఎస్ ట్రాన్స్ కో – 206
16) టీఎస్-ఆర్‌టీసీ – 4,768
17) హైదరాబాద్ జలమండలి – 807
18) తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ – 243
19) డీసీసీబీలు – 1,571
20) తుదిదశలో ఉన్న ఉద్యోగాల సంఖ్య – 6,258