అందరి లెక్కలు రాస్తున్నాం.. మిత్తితో సహా చెల్లిస్తాం – మంత్రి కేటీఆర్

Saturday, March 6th, 2021, 11:27:40 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని తన పదవులను గడ్డిపోచలా విసిరికొట్టి తెలంగాణ జెండా పట్టాడని, ఆయన పోరాట కష్టంతోనే తెలంగాణ సాధ్యమైందని, ఈ రోజు దేశంలో మన రాష్ట్రం సగర్వంగా నిలబడిందని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తిపై ఉద్యమంలో అడ్రస్ లేనివారు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇవాళ మాట్లాడే బఫూన్ గాళ్లకంటే ఎక్కువ మాట్లాడే సత్తా కేసీఆర్‌కు ఉందని గుర్తు చేశారు.

అయితే దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని అన్నారు. అసలు తెలంగాణ భారత దేశంలో లేదా? ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. ఐఐటీ, ఐఐఎంలు ఇవ్వని బీజేపీ ఏ మొహం పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్లు అడుగుతుందని నిలదీశారు. సీఎంలను ఉరికించిన చరిత్ర తమ పార్టీదని, ఈ బీజేపీ వాళ్లను ఉరికించుడు తమకు పెద్ద లెక్క కాదని అన్నారు. అందరు లెక్కలు రాస్తున్నామని, మిత్తీతో సహా చెల్లిస్తామని అన్నారు. ఇన్ని రోజులు ఓటుకు నోటు గాడు ఒర్లి ఒర్లి సైలెంట్ అయ్యాడని, కేసీఆర్‌తో పెట్టుకున్నోడు ఎవరూ బాగుపడలేదని అన్నారు.