తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్కు దుబ్బాక ఓటమి, గ్రేటర్లో ఆశించని ఫలితాలు రాకపోవడంతో ఇప్పుడు జరగబోయే ప్రతి ఎన్నికలు కత్తి మీద సాములా మారిపోయాయి. అయితే ఓవైపు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం నడుస్తుండగా, మరోవైపు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే నేడు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన మంత్రి కేటీఆర్ ఇప్పటి వరకు జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆరా తీశారు.
ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై ఆరా తీశారు. అంతేకాదు ఇప్పటికే సభ్యత్వ నమోదు సమయం అయిపోయిందని అయినా మీలో ఎందుకు చలనం లేదని క్లాస్ పీకినట్టు సమాచారం. అయితే మరో వారం రోజుల్లో నేతలంతా పూర్తి స్థాయిల సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.