ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతా హ్యాక్.. ఫాలోవర్స్‌కి క్షమాపణలు..!

Saturday, April 10th, 2021, 07:48:06 PM IST


టెక్నాలజీనీ వాడుకుందాం అని అనుకుంటే హ్యాకర్లు మాత్రం అదే టెక్నాలజీనీ వాడుకుని సాధారణ జనంతో ఆటాడేసుకుంటున్నారు. అయితే తాజాగా ఏపీ ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ ఖాతాను హ్యాకింగ్‌కి గురయ్యింది. హ్యాకింగ్ చేసి అందులో ఆశ్లీల చిత్రాలను పోస్ట్ చేశారు. అయితే ఈ విషయాన్ని మరో ట్వీట్ ద్వారా స్యయంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

అయితే ఎవరో హ్యాకర్లు తన ట్విటర్‌ ఖాతాను హ్యాక్ చేశారని, అసంబద్ధ పోస్టులు పెడుతున్నారని ఈ అసౌకర్యానికి తాను చింతిస్తున్నానని ట్వీట్ చేశారు. హ్యాకింగ్ గురైన కొద్ది రోజులకు తాను ఆ విషయాన్ని గుర్తించానని దీంతో వెంటనే ఆ చిత్రాలను తొలగించినట్టు చెప్పారు. ఈ విషయాన్ని ట్విట్టర్ సంస్థతో పాటు ఏపీ పోలీసులకు కూడా ఫిర్యాధు చేసినట్టు చెప్పారు. ఈ సంధర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఆశ్లీల చిత్రాలు వచ్చినందుకు తన ఫాలోవర్స్‌కు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి క్షమాపణలు చెప్పారు.