ఈ నెల 15 నుండి రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం జమ – మంత్రి నిరంజన్ రెడ్డి

Sunday, June 6th, 2021, 02:53:37 PM IST


తెలంగాణ రాష్ట్రం లో రైతులకు రైతు బంధు సాయం ఈ నెల 15 వ తేదీ నుండి జమ చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అయితే ఐఎఫ్ ఎస్ సి కోడ్ మారిన రైతుల ఖాతాల్లోనూ జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు. అయితే ఈ నెల 15 వ తేదీ లోపు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తామని ఒక ప్రకటన లో నిరంజన్ రెడ్డి తెలిపారు. అయితే కర్షకులు, స్తానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి బ్యాంకు ఖాతా, పాస్ బుక్, ఆధార్ వివరాలను అందించాలని కోరారు. అయితే ఈ నెల 10 వ తేదీ వరకు ధరణి లో నమోదు అయిన ప్రతి రైతు కు రైతు బంధు సాయం అందుతుంది అని నిరంజన్ రెడ్డి తెలిపారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రకటన తో రైతులు ధరణి లో తమ వివరాలను ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారు.