చచ్చిన పామును కొట్టాల్సిన పనిలేదు.. మంత్రి పెద్దిరెడ్డి సెటైరికల్ కామెంట్స్..!

Tuesday, April 13th, 2021, 03:00:02 AM IST


తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంపై టీడీపీ నేతలు సీరియస్‌గా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఓడిపోతారని చంద్రబాబుకీ ముందే తెలుసని, ఆయన ఆడే నాటకంలో ఇదొక భాగమని అన్నారు.

అయితే ఓడిపోతారని తెలిసే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి దెబ్బలు తగల్లేదని, ప్రశాంతంగా ఉన్న తిరుపతిలో అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అసలు చంద్రబాబుపై రాళ్లు వేయాల్సిన అవసరం ఎవరికి ఉందని, చచ్చిన పామును కర్రతో కొట్టాల్సిన పని లేదని అన్నారు. పోలీసులు దీనిపై విచారణ జరిపి నిజనిజాలు బయటకు తేవాలని, డ్రామా అని తేలితే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని అన్నారు.