ఏపీ లో అక్కడ వారం పాటు సంపూర్ణ లాక్ డౌన్ – పేర్ని నాని!

Wednesday, July 29th, 2020, 11:37:05 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఊహించని రీతిలో కరోనా ఉగ్ర రూపం దాల్చుతోంది. అయితే ఈ మేరకు ఆగస్ట్ మూడు నుండి 9 వ తేదీ వరకు మచిలీపట్నం లో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. మచిలీపట్నం లో కరోనా వైరస్ మహమ్మారి ను కట్టడి చేసేందుకు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు. అయితే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఆరు గంటలకు ఒక్క నిత్యావసరాల మినహా మిగిలిన అన్ని వ్యాపారాలు మూసి వేయబడతాయి అని అన్నారు.

అయితే రోడ్డు పై వాహనాలు తిరిగేందుకు సైతం అనుమతి లేదు అని అన్నారు. ప్రజలు అందరూ కూడా లాక్ డౌన్ కి సహకరించాలి అని కోరారు. అంతేకాక మచిలీపట్నం కి ఏ ఒక్కరూ కూడా రాకపోకలు జరపకూడదు అని అన్నారు. అయితే కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో దాదాపు 45 శాతం పాజిటివ్ రావడం చాలా విచారకరం అంటూ అవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, 60 ఏళ్ల వయసు దాటిన వారు ఎవరూ కూడా బయటికి రావొద్దు అని సూచించారు. అయితే లాక్ డౌన్ ను ఉల్లంఘించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరికలు జారీ చేశారు.