బిగ్ న్యూస్: కేసీఆర్ మాట వినకుండా జగన్ అలా చేసారా?

Friday, February 14th, 2020, 11:25:20 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. అయితే ఆర్టీసీ విలీనం విషయం లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఆర్టీసీ విలీనం అంశం ఫై మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆర్టీసీ ని విలీనం చేయొద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ కి చెప్పారని అన్నారు. అయితే ఆర్టీసీ విలీనాన్ని చాలామంది వ్యతిరేకించారని, చాల పొరపాటు చేస్తున్నావని జగన్ కి కేసీఆర్ చెప్పిన వ్యాఖ్యల్ని మీడియా తో తెలిపారు పేర్ని నాని.

ఆర్టీసీ కార్మికుల వేతనాలు ప్రభుత్వం చెల్లించడం గుదిబండ అని కేసీఆర్ అన్నారని తెలిపారు. అయితే ఆర్టీసీ ని విలీనం చేయొద్దని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ వినకుండా సవాల్ గా తీసుకున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం తప్పని భావిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే తాను చేస్తున్న పనుల్లో తప్పులున్నట్లు నిరూపిస్తే క్షమాపణలు చెపుతానని అన్నారు.