రహదారుల పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి – మంత్రి శంకర్ నారాయణ

Friday, June 11th, 2021, 07:30:14 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల మరమ్మత్తుల పనుల కోసం పిలిచిన టెండర్లను వచ్చే నెల జూలై 15 నాటికి ఖరారు చేసి పనులను ప్రారంభించాలి అని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి అయిన శంకర్ నారాయణ అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తో సహా పలువురు చీఫ్ ఇంజినీర్ల తో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఆర్ అండ్ బీ శాఖ లో వివిధ పథకాల కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ముందుగా ఎన్టీబీ మొదటి దశ మరియు రెండవ దశ కింద చేపట్టాల్సిన పనులకు టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అంతేకాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు నేడు పై కీలక వ్యాఖ్యలు చేశారు.

నాడు నేడు కింద ప్రాథమిక ఆసుపత్రులు, ఇతర ఆసుపత్రుల భవనాల మరమ్మత్తులు, ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అయితే రహదారుల పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి అంటూ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. అయితే రాష్ట్రం లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల పై సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ప్రణాళిక తో దూసుకు పోతుండటంతో వైసీపీ నేతలు అమలు చేసే పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.