ఇంటర్, పదవ తరగతి పరీక్షలు ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదు – మంత్రి ఆదిమూలపు సురేష్

Friday, June 11th, 2021, 06:25:47 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరగాల్సిన ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షల ను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి పక్ష పార్టీ నేతలు సైతం పరీక్షల నిర్వహణ పై అధికార పార్టీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ పదవ తరగతి పరీక్షలను ఇప్పట్లో పెట్టే పరిస్తితి లేదని స్పష్టం చేశారు. అయితే పరీక్షల నిర్వహణ లో రకరకాల ప్రతిపాదనలు పరిశీలించామని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే స్పష్టత వచ్చాక షెడ్యూల్ ప్రకటిస్తాం అని వ్యాఖ్యానించారు. అయితే ఈ మేరకు డీఎస్సీ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

2008 డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట ఇచ్చింది అని అన్నారు. అయితే 2,193 మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని వ్యాఖ్యానించారు. అయితే గతంలో బీఈ డీ అభ్యర్దులు చాలా కోల్పోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. 2008 డీఎస్సీ అభ్యర్థులను గత టీడీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు డీఎస్సీ అభ్యర్ధులను కూడా మోసం చేశారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.