కరోనా వస్తుంటది, పోతుంటది.. మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు..!

Thursday, July 9th, 2020, 06:52:25 PM IST


గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నా కేబినెట్ భేటీ వాయిదా పడటంతో ఇక లాక్‌డౌన్ ఉండదన్న అభిప్రాయానికి చాలా మంది వచ్చేశారు. అయితే తాజాగా నేడు మీడియాతో మాట్లాడిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరబాద్‌లో లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధించడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని ఇక కరోనా వస్తుంటుంది, పోతుంటది ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాను కట్టడి అవుతుందని అన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ నేత వి.హనుమంతురావు వంటి వారి కరోనా వచ్చినా కోలుకున్నారని రోగ నిరోధక శక్తి లేని వారే కరోనాతో చనిపోతున్నారని అన్నారు. ఇక సీఎం కేసీఆర్ కనిపించడం లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారని సీఎం కనిపించకపోతే పాలన ఆగిందా అని ప్రశ్నించారు.