చిరంజీవి, నాగార్జునలతో మంత్రి తలసాని భేటీ..!

Tuesday, February 4th, 2020, 07:34:58 PM IST

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హీరోలు చిరంజీవి, నాగార్జునలతో భేటీ అయ్యారు. చిరంజీవి ఇంట్లోనే ఈ భేటీ జరిగింది. అయితే చలన చిత్ర రంగానికి సంబంధించిన పలు విషయాలతో పాటు తాజా రాజకీయాలకి సంబంధించిన విషయాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చాయి.

అయితే ఇటీవల మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ భారీ మెజారిటీనీ సంపాదించుకోవడంతో, రాబోయే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇండస్ట్రీ నుంచి కాస్త పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంటుందేమో అని సీఎం కేసీఆరే తలసానిని చిరు, నాగ్‌లతో భేటీ కమ్మన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చిరంజీవి తమ్ముడు పవన్ బీజేపీతో కలిసి పనిచేస్తుండడంతో రేపు జరగబోయే గ్రేటర్ ఎన్నికలకు పవన్ ప్రచారం చేస్తారన్న భయంతో కూడా ఈ భేటీ జరిగి ఉండవచ్చేమోనని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా వీరి ముగ్గురి భేటీ మాత్రం అటు ఇండస్ట్రీలో, ఇటు రాజకీయాలలో ప్రాధాన్యతను సంతరించుకుంది.