మాట ప్రకారమే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము–మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు!

Wednesday, January 15th, 2020, 01:20:33 AM IST

తెలంగాణ మంత్రి తలసాని యాదవ్ ఇరు ప్రాంతాల అభివృద్ధి గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాకుండా ఇరు రాష్ట్రాల మంత్రులు కలవడం మంచి పరిణామం అని అన్నారు. భోగి పండుగని ప్రతి ఏటా జరుపుకునే తలసాని ఈ ఏడాది కూడా భీమవరం లో జరుపుకున్నారు. అయితే ఇక్కడి ప్రాంత విశేశాలతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

ఇక్కడి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో గతేడాది ప్రభుత్వం మారుతుందని చెప్పానని, దానికి తగ్గట్లుగా టీడీపీ పోయి, వైయస్సార్ పార్టీ వచ్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఒకాయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని మాట ప్రకారమే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని పరోక్షంగా చంద్రబాబు ను ఉద్దేశించి మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాకుండా హైదరాబాద్ లో పెద్ద భవనం ఒకటి కట్టి, హైదరాబాద్ అంతా తానే అభివృద్ధి చేసినట్లు చెప్పుకొని తిరుగుతున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన బాగుందని మంత్రి తలసాని అన్నారు.