అరెరే తుమ్మ‌ల‌కు ముప్పుతిప్ప‌లు!?

Sunday, October 21st, 2018, 11:55:30 PM IST

రాజ‌కీయం అంటే స‌వాళ్ల‌తో కూడుకున్న‌ది. ఇక్క‌డ త‌న ముందున్న‌ ఛాలెంజ్‌ని స్వీక‌రించాలి. పొరుగువాడి ఛాలెంజ్‌ని స్వీక‌రించి గెలిపించాలి. ఆ రెండిటిలో స‌త్తా చాటితేనే రాణించిన‌ట్టు. లేదంటే చేత‌కాన‌ట్టే. ప్ర‌స్తుతం ఖ‌మ్మం తేరాస నాయ‌కుడు, మంత్రి తుమ్మ‌ల ప‌రిస్థితి అలానే ఉందిట‌. సాక్షాత్తూ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న మెడ‌కు ఓ గుదిబండ‌ను త‌గిలించ‌డంతో ఎటూ పోలేని ప‌రిస్థితిలో తుమ్మ‌ల ఇరుక్కుపోయాడ‌ట‌. అలాంటి భ‌యాన‌క‌మైన టాస్క్ తుమ్మ‌ల‌కు ఎద‌రైంద‌ని గులాబీ కండువాల్లో ముచ్చ‌ట సాగుతోంది.

అస‌లింత‌కీ ఏమా టాస్క్‌? అంటే.. సత్తుపల్లి నుంచి ఎస్సీ కార్పొరేషన్ చీఫ్ మాదిగ నేత పిడమర్తి రవిని గెలిపించే బాధ్యతను తుమ్మ‌ల‌కు అప్ప‌గించార‌ట కేసీఆర్. అయితే అక్క‌డ ప‌రిస్థితులు ఏమాత్రం బాలేదు. ప్ర‌త్య‌ర్థి తేదేపా అంత‌కంత‌కు బ‌ల‌ప‌డుతోంది. తేరాస‌ను దెబ్బ కొడుతూ పార్టీ క్యాడ‌ర్‌ను త‌మ పార్టీ వైపు లాగేసుకుంది. పైగా పార్టీలో ఇన్న‌ర్ గొడ‌వ‌లు, క‌ల‌త‌లు వంటి ప్ర‌తికూల ప‌రిస్థితులెన్నో క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయిట‌. కనీసం తుమ్మ‌ల సామాజిక వ‌ర్గం స‌హ‌క‌రిస్తుంద‌ని భావించిన కేసీఆర్ కు ఆ భ‌రోసా కూడా క‌నిపించ‌లేద‌ని, తుమ్మల సామాజిక వర్గానికి చెందిన తేరాస‌ కీలకనేతలంతా తేదేపాలోకి జంప్ అయిపోతున్నార‌ని తెలుస్తోంది. ర‌వికి మ‌ద్ధ‌తివ్వాల‌ని కోరిన‌ప్ప‌టికీ.. కొత్తూరి ఉమా మహేశ్వరరావు , అంకం రాజు, గోపీ వంటి కీలక నేతలు పార్టీని వీడి వెళ్ల‌డం పెద్ద స‌మ‌స్య అయ్యింఇ. వీళ్ల‌తో పాటు మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ లు తేదేపాలో చేరే స‌న్నివేశం ఉందిట‌. పైపెచ్చు తుమ్మ‌ల త‌న‌కు ఏమాత్రం సాయం కాలేక‌పోయార‌ని ర‌వి నేరుగా కేసీఆర్ కే ఫిర్యాదు చేశార‌ట‌. మ‌రోవైపు మ‌ట్టా ద‌యానంద సైతం ర‌వికి సాయ‌ప‌డ‌లేదు. దీంతో అన్ని క‌ష్టాలు ఒకేసారి త‌నకే చుట్టుకున్నాయ‌ని తుమ్మ‌ల బెంబేలెత్తుతున్నార‌ట‌. మంత్రి ప‌ద‌వి కావాలంటే, కేసీఆర్ మెప్పు పొందాలంటే త‌న‌వారిని గెలిపించాల్సిన స‌న్నివేశం ఉంది. మ‌రి తుమ్మ‌ల ఈ స‌న్నివేశంలో ఎలాంటి స్కెచ్ వేస్తారు? అన్న‌ది చూడాలి.