హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరెక్టర్ల దారుణం..17 రోజుల పాటు మైనర్ బాలిక పై..

Thursday, December 29th, 2016, 11:34:30 PM IST

girl1
సినిమాల్లో డాన్సర్ గా స్థిరపడాలని హైదరాబాద్ వచ్చిన 15 ఏళ్ల మైనర్ బాలిక పై ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ లు దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ లు మరో ఇద్దరు వారిస్నేహితులు కలసి ఆ బాలిక పై 17 రోజుల పాటు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో డాన్సర్ గా స్థిరపడాలని ఆ బాలిక హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం 2 లో తన మేనమామ ఇంటికి వచ్చింది. అదేప్రాంతం లో ఉంటున్న ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ లు షేక్ అక్బర్ (21), తూము వెంకారెడ్డి(22) మరియు వారి ఇద్దరు స్నేహితులు ఆమె బలహీనతని ఆసరాగా చేసుకుని ఈ దారుణానికి ఒడికట్టారు.

ఆమెకు సినిమాల్లో అవకాశం కల్పిస్తామని మభ్య పెట్టారు. దీనితో ఆ బాలిక వారిని నమ్మింది. ఈ నెల 3న ఆమెని వారు రంగారెడ్డి జిల్లా నందిగామకు తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. 17 రోజులపాటు ఆమెని జీడిమెట్ల, చింతల్ వంటి ప్రాంతాలకు తీసుకుని వెళ్లి అత్యాచారం చేశారు. దీనితో బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోన్ నెంబర్ల ఆధారం గా పోలీస్ లు వారిని అరెస్టు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments