మిస్ దివా 2018పై టాలీవుడ్ క‌న్ను

Sunday, September 2nd, 2018, 04:33:29 PM IST

మిస్ దివా యూనివర్స్ 2018 కిరీటాన్ని నేహ‌ల్ చౌదాసామా గెలుపొందారు. ఈ పోటీల్లో విజేత అయిన నేహ‌ల్ మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో ఇండియా త‌రపున పాల్గొంటారు. పోటీల్లో గెలిచిన నేహ‌ల్‌కు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల‌ న‌గ‌దు బ‌హుమ‌తి అంద‌జేశారు. ఈ పోటీలో మిస్ దివా సుప్రా నేష‌న‌ల్ గా అదితి హండియా, మిస్ దివా 2018 ర‌న్న‌ర్‌గా రోష్నీ షెరాన్‌లు నిలిచారు. ఈ పోటీల‌కు న్యాయ నిర్ణేత‌లుగా మిస్ యూనివ‌ర్స్ 2000 లారాద‌త్తా, మిస్ యూనివర్స్ 2017 డెమి – లీగ్ నెల్ – పీటర్స్, డిజైనర్లు డుయో ఫాల్గుని, షేన్ నెమలి, ప్రఖ్యాత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుట్, సంచలనాత్మక శిల్పా శెట్టి, నేహా దూపియా వ్య‌వ‌హ‌రించారు. సోనాక్షి సిన్హా, న‌టుడు టైగ‌ర్ ష్రాప్ నృత్యం, అలాగే మ‌న్సీ స్కాట్ షోస్ హైలైట్‌. ఈ పోటీల్లో పాల్గొన్న వారంద‌రూ లారాద‌త్తా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శిక్ష‌ణ పొందారు. 19 మందిలో ఎవ‌రినీ విజేత‌లుగా ప్ర‌క‌టించాల‌నేది న్యాయ నిర్ణేత‌ల‌కు నిజంగా క‌ష్ట‌మైంద‌ని లారాద‌త్తా తెల‌ప‌డం విశేషం.

ఈ ద‌ఫా మిస్ యూనివ‌ర్స్ కిరీటం దేశానికి రావాల‌ని కోరుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. గ‌తంతో పోల్చుకుంటే ఈ సారి పోటీలు భారీఎత్తున జ‌రిగాయి. లక్నో, కోల్‌క‌త్తా, ఇండోర్, హైదరాబాద్, పూణే, అహ్మాదాబాద్, బెంగుళూరు, చండీగఢ్, ఢిల్లీ వంటి పట్టణాల నుంచి దివాస్‌ పొల్గొన్నార‌ని తెలిపారు. ముంబ‌యిలో జ‌రిగిన‌ ఆడిషన్ల తో ఎంపిక ప్ర‌క్రియ ముగిసింద‌న్నారు. అనంత‌రం నాలుగు నగరాల పర్యటన ప్రారంభమైంద‌న్నారు. త‌రువాత నాలుగు నగరాల్లో గోవా, ఢిల్లీ, చెన్నై, ముంబ‌యిల్లో ఉప – పోటీలు నిర్వహించామ‌న్నారు. టాలెంట్ ఉన్న‌వారికి యమహా ఫాస్కినో అవకాశాల‌ను కల్పించ‌డంలో ఎప్పుడూ ముందు వ‌ర‌స‌లో ఉంటుంద‌న్నారు. వ‌రుస‌గా ఐదోసారి ఈ పోటీల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఇక మిస్ దివా కార్య‌క్ర‌మాన్ని నిశితంగా ప‌రిశీలిస్తున్న టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు టాప్ మోడ‌ల్స్ నుంచి గెలుపొందిన వారికి అవ‌కాశాలిచ్చేందుకు సిద్ధంగా ఉంటార‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం పోటీ విజేత‌ల్లో ఎంద‌రినీ ఆ ఒక్క ఛాన్స్ వ‌రిస్తుందో వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments