ఇండియాలో మిష‌న్ పీక్స్‌..

Monday, July 23rd, 2018, 12:43:59 PM IST

ఇండియాలో హాలీవుడ్ సినిమాల‌కు ఆద‌ర‌ణ అంత‌కంత‌కు పెరుగుతోంది. 2డి సినిమాల్ని మించి 3డి సినిమాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న త‌రుణంలో హాలీవుడ్ చిత్రాలు బంప‌ర్ హిట్లు కొడుతున్నాయి. భార‌త దేశం నుంచి సునాయాసంగా 300కోట్ల వ‌సూళ్లు సాధిస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. కేవ‌లం 2018లో మ‌న దేశం నుంచి 2000 కోట్ల సొమ్ముల్ని పాశ్చాత్య సినిమాలు ఎగ‌రేసుకుపోయాయంటే అతిశ‌యోక్తి కాదు. ఈ ఏడాదిలో రిలీజైన బ్లాక్ పాంథ‌ర్, జురాసిక్ వ‌ర‌ల్డ్ 2, అవెంజర్స్ 2, ఇన్‌క్రెడిబుల్స్ 2, యాంట్‌మ్యాన్ అండ్‌ ది వాస్ప్ చిత్రాలు ఈ స్థాయిలో డ‌బ్బును గంప‌గుత్త‌గా విదేశాల‌కు ఎత్తుకెళ్లాయి.

తాజాగా రిలీజ్‌కి వ‌స్తున్న‌ `మిష‌న్ ఇంపాజిబుల్- ఫాలౌట్` భార‌త‌దేశంలో అసాధార‌ణ వ‌సూళ్లు సాధించ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. జూలై 27న అంటే మ‌రో మూడు రోజుల్లో రిలీజ్‌కి వ‌స్తున్న ఈ సినిమా ఆన్‌లైన్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోనున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే మై బుక్ షో టిక్కెట్ విండో హోరెత్తిపోతోంది. హైద‌రాబాద్‌, చెన్న‌య్, ముంబై వంటి మెట్రోల్లో వారంపాటు థియేట‌ర్లు బ్లాక‌య్యే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అంటే ఇండియాలో ఇక మిష‌న్ మొద‌లైన‌ట్టే. టామ్ క్రూజ్ అసాధార‌ణ విన్యాసాల్ని వీక్షించాల‌న్న త‌ప‌న అభిమానుల్లో అంత‌కంత‌కు రెయిజ్ అవుతోంది. అయితే ఇది లోక‌ల్ సినిమాల‌కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. తాజాగా రిలీజైన‌ మిష‌న్ ఇంపాజిబుల్ `ఫాలౌట్‌` టీజ‌ర్ దుమ్ము రేపేస్తోంది. యూట్యూబ్‌లో ఇప్ప‌టికే కోటిన్న‌ర మంది ఈ టీజ‌ర్‌ని వీక్షించారు. ఇక ఈ సినిమా ఇండియా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోన‌ని ట్రేడ్ నిపుణులు ఆస‌క్తిగా ప‌రిశీలిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments