బాహుబలికి ఇచ్చిన అవార్డులో పొరపాటు!

Friday, April 13th, 2018, 03:02:40 PM IST

65వ నేషనల్ అవార్డులను రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఎవరు ఊహించని విధంగా ఒక పెద్ద పొరపాటు జరిగిపోయింది. అవార్డు ఎవరికీ ఇవ్వాలని అనుకున్నారో గాని సినిమాకు సంబంధం లేని వ్యక్తి పేరును ప్రకటించారు. అదికూడా బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రం విషయంలో జరగడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న చిత్ర నిర్మాత శోబు యార్లగడ్డ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

బాహుబలి సినిమాకు గాను యాక్షన్ డైరెక్టర్ అబ్బాస్ అలీ మొఘల్ ను బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా జ్యూరీ ప్రకటించింది. దీంతో శోబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అబ్బాస్ అలీ మొఘల్ ఎవరు?. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలకు ఆయన పనిచేయలేదని చెప్పారు. అలాగే పీటర్ హెయిన్స్ రెండు సినిమాలకు యాక్షన్ డైరెక్టర్ గా వర్క్ చేసినట్లు ట్వీట్ చేశారు. దర్శకుడు శేఖర్ కపూర్ నాయకత్వం వహిస్తున్న జ్యూరీ ఈ అవార్డులను ఢిల్లీలోని శాస్త్రి భవన్ లో ప్రకటించారు. తెలుగు సినిమాలకు ఈ సారి అవార్డులు బాగానే దక్కాయి. బాహుబలి సినిమాకు మూడు అవార్డులు రాగా ఘాజి సినిమా ఉత్తమ తెలుగు ఫిల్మ్ జాబితాలో అవార్డు అందుకుంది.

  •  
  •  
  •  
  •  

Comments