హాట్ పిక్ : వామ్మో మిథాలీ.. షారూఖ్ పక్కన రెచ్చిపోయిందిగా..!

Tuesday, September 26th, 2017, 03:30:14 PM IST


భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోజులని పోస్ట్ చేస్తుండడంతో మిథాలీ గత కొని రోజులుగా నెటిజన్ల మధ్య చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమె వోగ్ మ్యాగజైన్ కు షారుఖ్ ఖాన్ తో ఇచ్చిన పోజుని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో మిథాలీ ఇంకాస్త గ్లామర్ డోసుని పెంచి హాట్ గా కనిపిస్తోంది.

వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీ పైన షారుఖ్ ఉండగా.. అతడికి అటువైఒపు ఇటువైపు మిథాలీ, నీతా అంబానీ ఫోజులిచ్చారు. వోగ్ మ్యాగజైన్ 10 వ యానవర్సరీ సందర్భంగా, ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా మిథాలీ పోజు ఇచ్చింది. తనపై సోషల్ మీడియాలో ఎన్ని కామెంట్లు వినిపిస్తున్నా ఆమె మాత్రం అసలు పట్టించుకోకుండా తన దారిలో తాను వెళుతోంది. తాజాగా ఫోజుపై అప్పుడే చర్చ మొదలైపోయింది.

  •  
  •  
  •  
  •  

Comments