సీఎం జగన్‌కి ఎమ్మెల్యే ఆనం క్లారిటీ.. అదే విషయమేనా..!

Wednesday, December 11th, 2019, 02:47:45 AM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు మాత్రమే గడిచినా అప్పుడే సొంత పార్టీలో కలహాలు మొదలయ్యాయి. అయితే ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి చేసిన సొంత పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో తీవ్ర దుమారం రేపాయి. నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందని తన పార్టీకే చెందిన మంత్రి అనిల్‌కుమార్‌, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలపై ఆనం రామనారాయణరెడ్డి పరోక్షంగా ఆరోపణలు చేశారు. అయితే ఆనం వ్యాఖ్యలపై స్పందించిన సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని పార్టీ నేతలను జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

అయితే మొన్న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సీఎం జగన్‌పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. అయితే మొన్న ఆనం మాట్లాడిన మాటలపై వివరణ ఇవ్వాలని సీఎం జగన్ ఆయనను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సీఎం జగన్‌ను నేడు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కలిసి వివరణ ఇచ్చుకోనున్నారు.