గవర్నర్ ప్రసంగంపై నిప్పులు చెరిగిన బాలయ్య

Friday, June 14th, 2019, 01:14:16 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం చేశాడు.. దాదాపు 20 నిమిషాలకి పైగా సాగిన ఈ ప్రసంగంలో సూటిగా సుత్తి లేకుండా, ప్రభుత్వ ఆలోచనలను చెప్పుకొచ్చాడు గవర్నర్.. దీనిపై ప్రతిపక్ష సభ్యులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా హిందూపూర్ MLA నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం మేము ఆశించిన స్థాయిలో జరగలేదు.
ముఖ్యంగా చేతి వృత్తుల గురించి మాట్లాడలేదు. అలాగే ఎంతో ప్రాముఖ్యత కలిగిన అమరావతి నిర్మాణం గురించి మాట్లాడలేదు. కేవలం నవరత్నాలు, జలయజ్ఞం గురించి మాత్రమే అయన మాట్లాడాడు..

చంద్రబాబు ఎంతో కష్టపడి నిర్మాణం చేప్పట్టిన అమరావతి గురించి మాట్లాడకపోవటం శోచనీయాంశం. అమరావతి గురించి చాలా మంది ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. కనీసం దానిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా గవర్నర్ ప్రసంగం సాగిందంటూ చెప్పకొచ్చాడు. ఇదే సమయంలో వైసీపీ వాళ్ళు విమర్శించిన “బంట్రోతు” అనే మాట గురించి బాలకృష్ణ మాట్లాడుతూ, “మమ్మలని గెలిపించిన ప్రజలకి మేము బంట్రోతులు” తప్పితే ఇంకా ఎవరికీ కాదు. వాళ్ళు ఏమైనా వాళ్ళ నాయకుడికి బంట్రోతులు కావచ్చు ఏమో. అందుకే అలా మాట్లాడారంటూ ఘాటుగా విమర్శించాడు బాలయ్య