తెలంగాణ దినం అధికారికం కాదా?

Monday, September 15th, 2014, 04:02:46 PM IST


గతంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారకంగా నిర్వహిస్తామని చెప్పిన కెసిఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకుఆ పని చేయడంలేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించనివారు తెలంగాణ వారసులు ఎలా అవుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కర్ణాటకలో విమోచన దినాన్ని అధికారకంగా జరుపుకుంటున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినం అధికారికంగా జరిపేందుకు ఎంఐఎం అభ్యంతరాలు చెప్పలేదని.. ఈ విషయంపై ప్రో. కోదండరాం ఎందుకు నోరు మెదపడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.