జగన్ విజన్ విప్లవమైతే.. చంద్రబాబుది 420 విజన్ – ఎమ్మెల్యే రోజా

Thursday, December 3rd, 2020, 04:30:34 PM IST

ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశంసల వర్షం కురిపించారు. వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతమని అన్నారు. మహిళలకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్ అమలు చేశారని అన్నారు. భావితరాల గురించి ఆలోచించే నేత సీఎం జగన్ అని, మహిళా సాధికారత కోసం జగన్ కృషి చేస్తున్నారని అన్నారు.

అంతేకాదు ప్రతి ఆడ బిడ్డను రక్షించే విధంగా దిశ చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు. మహిళల అభ్యున్నతికి చంద్రబాబు చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబుది 420 విజన్ అయితే వైఎస్ జగన్ విజన్.. ఓ విప్లవం అని నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించే ప్రజా నాయకుడు జగన్ అని అన్నారు. చంద్రబాబు జగన్‌ని ఫేక్ సీఎం అని అంటున్నారని, జగన్ ఫేక్ సీఎం కాదు టీడీపీనీ షేక్ చేసిన సీఎం అని కౌంటర్ ఇచ్చారు. పేదవాళ్లకు ఇచ్చే ఇళ్లపై కూడా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని అయినా సీఎం జగన్ ఏ విషయంలోనూ వెనుకడగు వేయడం లేదని అన్నారు.