ఎమ్మెల్యే రోజా సరికొత్త నిర్ణయం – తెలిస్తే షాకే…

Monday, November 18th, 2019, 11:00:06 PM IST

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తాజాగా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే వరసగా రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజాకి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక రోజాకి మంత్రి పదవి వస్తుందని అందరు భావించారు. కానీ కొన్ని రాజకీయ కుల సమీకరణాలు వలన రోజాకి మంత్రి పదవి దక్కలేదు. అయితే రెండవసారి జరిపే మంత్రి వర్గ విస్తరణలో రోజాకి మంత్రి పదవి ఇస్తానని చెప్పకనే చెప్పారు సీఎం జగన్. ఇకపోతే అప్పటివరకు ఒక ఏపీఐఐసీ చెయిర్ పర్సన్ గా ఒక నామినేటెడ్ పదవిని అప్పగించారు సీఎం జగన్.

ఇకపోతే రోజా కి తన నియోజవర్గం మీద పట్టు లేదని, ఒకవైపు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా టీవీ షో లు బాగా చేసుకుంటుందని అప్పట్లో బాగానే విమర్శలు వచ్చాయి. కాగా ఈమేరకు రోజా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా తన నియోజవర్గంలో నిరంతర పర్యటనలు చేయాలనీ, తన నియోజక వర్గ ప్రజలకు అవసరమైన సమస్యలు అన్ని తీర్చాలని బావిస్తుందంట. అందుకనే మరే ఇతర టీవీ షోలకు కూడా రోజా ఒప్పుకోవట్లేదంట. ఇకపోతే ఇలా చేస్తేనైనా సీఎం జగన్ దృష్టిలో పడి మంత్రి పదవి దక్కించుకోవాలని రోజా భావిస్తోస్తుందంట. కాగా రోజా చేస్తున్న ప్రయత్నాలు ఈ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి.