చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయింది.. ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, June 8th, 2021, 11:44:13 PM IST

MLA_Roja

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ కార్యాల‌యం వ‌ద్ద మీడియాతో మాట్లాడిన రోజా సీఎం జగన్‌ను విమర్శించే అర్హత చంద్రబాబు నాయుడికి, లోకేశ్‌లకు లేదని అన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలకు భద్రత కల్పించారని, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు చేస్తున్న చేష్టలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, చూస్తుంటే ఆయనకు చిన్నమెదడు చితికిపోయిందేమోనన్న అనుమానం కలుగుతుందని అన్నారు.

అయితే టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు తిరుప‌తి ఉప ఎన్నిక సంద‌ర్భంగా చెప్పినట్టు ‘పార్టీ లేదు.. తొక్కా లేదు’ అన్నట్లే టీడీపీ పరిస్థితి ఉందని రోజా ఎద్దేవా చేశారు. కుల, మత, రాజకీయాలకతీతంగా అన్ని సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందిస్తూ సీఎం జగన్ ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ పాలనను నీతి అయోగ్‌ కూడా ప్రశంసించిందని ఈ సందర్భంగా రోజా గుర్తు చేశారు.