ఉచిత అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తేవాలి – ఎమ్మెల్యే సీతక్క

Sunday, May 16th, 2021, 03:06:39 PM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రం లో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే కరోనా వైరస్ చికిత్స ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని ఇప్పటికే అధికార తెరాస పై ప్రతి పక్ష పార్టీ నేతలు ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క అధికార పార్టీ తెరాస పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా వైరస్ చికిత్స ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి అంటూ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. అయితే అధికార పార్టీ తెరాస తీరును నిరసిస్తూ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు సీతక్క. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అంతేకాక కరోనా వైరస్ వాక్సిన్ లను కూడా ప్రజల ఇంటి వద్దకు వెళ్ళి ఉచితంగా వేయించాలి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్వహించాలి అని డిమాండ్ చేశారు సీతక్క. అయితే ఎమ్మెల్యే సీతక్క చేసిన వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.