టీజర్ : ఎమ్మెల్యే..వస్తున్నాడు..వచ్చేస్తున్నాడు..!

Sunday, January 14th, 2018, 01:21:19 PM IST

చాలా కాలం హిట్ లేక ఇబ్బంది పడిన కళ్యాణ్ రామ్ పటాస్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ చిత్రంలో జోవియల్ పోలీస్ గా కనిపించి మెప్పించాడు. ఆ తరువాత వచ్చిన ఇజం, షేర్ వంటి చిత్రాలు నిరాశ పరిచాయి. ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ సరి ఎమ్మెల్యే అవతారం ఎత్తబోతున్నాడు. కళ్యాణ్ రామ్ నటించి ఎమ్మెల్యే చిత్ర టీజర్ కొద్దీ సేపటి క్రితమే విడుదలయింది. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

39 సెకండ్ల టీజర్ లో కమెడియన్ పృద్వి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నా కళ్యాణ్ రామ్ పాత్రని చాలా సరదాగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఒక్కడే రిక్షా ఎక్కి ప్రచారం చేస్తుంటే.. రిక్షాని పృద్వి నడుపుతున్నాడు. వస్తున్నాడు.. వచ్చేస్తున్నాడు.. మన అందరి ఆశాజ్యోతి ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి , నమస్తే తెలంగాణ అంటూ కమెడియన్ పృద్వి చెప్పే డైలాగు ఆకట్టుకుంటోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నా ఎంటర్ టైన్మెంట్ పక్క అని టీజర్ ద్వారా అర్థం అవుతోంది.