చంద్రబాబు టీడీపీని బీజేపీ లో విలీనం చేయడం ఖాయం – వల్లభనేని వంశీ

Thursday, April 8th, 2021, 02:52:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ మేరకు తెలుగు దేశం పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్ పైరీ అయిన టాబ్లెట్ లాంటి వాడు అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ లో లోకేష్ గుదిబండ లాంటి వాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు టీడీపీని బీజేపీ లో విలీనం చేయడం ఖాయం అంటూ చెప్పుకొచ్చారు. అయితే తెలుగు తమ్ముళ్లు ఆలోచించుకోవాలి అంటూ వంశీ వ్యాఖ్యానించారు. అయితే పంచాయతీ ల్లో 40 శాతం ఓట్లు వచ్చాయి అని టపాసులు కాల్చిన తండ్రీ కొడుకులు ఏపీ ను వదిలి ఎందుకు పారిపోయారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక ప్రజా స్వామ్యం లో ప్రతి ఎన్నికా ముఖ్యమైనదే అని అన్నారు. చంద్రబాబు ఎన్నికల నుండి తప్పుకోవడం ఆడలేక మద్దెల వోడు అన్నట్లు ఉంది అంటూ సెటైర్స్ వేశారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం లో అందించని సంక్షేమ పథకాలు సీఎం జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు అందిస్తున్నారు అని అన్నారు.

అయితే సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు అని అన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా అండగా నిలిచారు అని ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఓటుకు నోటు కేసులో అధికార తెరాస కి భయపడి తెలంగాణ లో టీడీపీ ను విలీనం చేశాడు చంద్రబాబు అంటూ ఆరోపించారు. అంతేకాక 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా ఉన్నప్పటికీ పారిపోయి వచ్చాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.