అరుణ్ జైట్లీ అంత్యక్రియలకు మోడీ డుమ్మా… కారణం ఏంటి…?

Sunday, August 25th, 2019, 01:37:11 AM IST

కొన్ని ఆరోగ్య సమస్యల వలన భారతీయజనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి మరణించాడన్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఆయన భౌతిక ఖాయాన్ని ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి కైలాష్‌ కాలనీలో ఆయన నివాసానికి తరలించారు. కాగా అరుణ్ జైట్లీ అంత్యక్రియలను ఆదివారం నాడు ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో నిర్వహించనున్నారు. అయితే ఈమేరకు జైట్లీ పార్థివదేహాన్ని, రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం అక్కడ కొద్దీ సేపు ఉంచనున్నారు. అయితే ఈ జైట్లీ అంత్యక్రియలకు భారత ప్రధాని మోడీ హాజరు కాలేకపోతాడని సమాచారం.

కాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం యూఏఈ, బహ్రెయిన్ వెళ్లిన ఆయన తన ప్రణాళిక ప్రకారం అక్కడే ఉండాల్సి వస్తుంది. అయితే జైట్లీ మరణ వార్త తెలుసుకున్న మోడీ ఆయన పర్యటన ని కొనసాగిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా జైట్లీ మరణ వార్తను తెలుసుకున్న మోడీ, జైట్లీ కుటుంబ సభ్యులందరితో మాట్లాడి వారికీ ధైర్యాన్ని చెప్పారంట మోడీ… అయితే జైట్లీ మరణంతో కృంగిపోయిన మోడీ తిరిగి ఢిల్లీకి వస్తానంటే, జేట్లీ కుటుంబ సభ్యులు తన పర్యటనను పూర్తీ చేసుకొనేరమ్మన్నారని సమాచారం. జైట్లీ చివరి చూపుకి కూడా నోచుకోలేకపోతున్నందుకు మోడీ కన్నీటిపర్యంతం అయ్యారని సమాచారం.