మోడీ ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ !

Wednesday, November 30th, 2016, 04:05:21 PM IST

modi123
మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అంత సులువుగా ముగిసే అధ్యాయంలా కనిపించడం లేదు. పెద్దనోట్ల రద్దు తో సామాన్యుల ఇబ్బందులు పెరుగుతున్న కొద్దీ దేశంలోని విపక్షాలు మోడీ పై అరచి గగ్గోలు పెడుతున్నాయి.పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని పలువురు కార్పొరేట్ అధినేతలకు మోడీ లీక్ చేశారన్న ఆరోపణలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ముందే లీక్ అవడంతో బిజెపి ఎంపీలు చాలా మంది వారి న్లల్ల ధనాన్ని వివిధ రూపాల్లో ఇన్వెస్ట్ చేశారని ప్రతిపక్షాలు కొత్త పాట అందుకుంన్నాయి. దీనితో ప్రతిపక్షాల ముందు మోడీ తన నిజాయితీని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనితో బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యే లు అందరూ వారి బ్యాంకు ఖాతాల వివరాలు, నవంబర్ 8 నుంచి అంటే మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పటినుంచి జరిపిన బ్యాంకు లావాదేవీల వివరాలను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు అందించాలని మోడీ ఆదేశించారు.

విపక్షాల ఆరోపణల నేపథ్యంలో మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన వుంది. సొంత పార్టీ నేతల పట్లే మోడీ కఠినంగా వ్యవహరిస్తున్నారన్న సంకేతాలను పంపడానికే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. కానీ ఆ వివరాలను అందరు ఎంపీలు, ఎమ్మెల్యే లు అమిత షాకి అందజేస్తారా లేదా ?వాటి వివరాలను అమితాషా ప్రజలకు తెలియ జేస్తారా లేదా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇది కేవలం ఒక పార్టీ పరమైన చర్యగా ముగిస్తే ఎంపీల బ్యాంకు ఖాతాల వివరాలు బయటకు తెలిసే అవకాశం లేదు.ఈ రకమైన చర్యలవలన ఎంపీలలో సైతం మోడీ పై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎంపీల పై మోడీ అనుమానం కేవలం విపక్షాల కోసమే అని అంటున్నారు. నిజంగానే మోడీ ఎంపీల బ్యాంకు ఖాతాలు పరిశీలించి, లొసుగులున్న వారిపై చర్యలు తీసుకుంటే మాత్రం బ్లాక్ మని ఉన్న వారికి మోడీ డేంజరస్ మాన్ అనే చెప్పాలి.