కేసీఆర్ అమరుల త్యాగాల్ని వృధా చేసారు – మోడీ ఫైర్..!

Tuesday, November 27th, 2018, 04:28:23 PM IST

తెలంగాణలో పర్యటన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ బహిరంగ సభలో కేసీఆర్ పై ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రము ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితంగా ఏర్పడిందని, ఎంతో మంది యువకుల బలిదానాలు తెలంగాణ రాష్ట్రం వెనకున్నాయని ప్రస్తుత పాలకులు వాటిని వృధా చేస్తున్నారని అన్నారు, దీనిని కొనసాగనివ్వబోమని అన్నారు, తెలంగాణ ప్రజలు కన్న కళలు సాకారం కావడం లేదని, వాటిని సాకారం చేయాల్సిన స్థానంలో ఉన్న ప్రభుత్వం ఆ దిశగా పని చేయటం లేదని నిప్పులు చెరిగారు.

తెలంగాణలోని యువత, రైతులు, బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీల కోసం ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి, ఏం అభివృద్ధి సాధించారని ప్రశ్నించారు. వాగ్దానాల అమలులో ప్రభుత్వ వైఫల్యం పై సమాధానం చెప్పి తీరాల్సిందే అని ప్రధాని అన్నారు. దశాబ్దాలుగా ఏమి చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపిస్తూ వచ్చినట్టు కేసీఆర్, అయన కుటుంబీకులు కూడా ప్రభుత్వాన్ని స్థాపించవచ్చని అనుకుంటున్నారని, అది జరగదు, జరగనివ్వబోమని మోడీ అన్నారు. ఈ దేశం యువతది, యువత బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని కేసీఆర్ పై ప్రధాని నిప్పులు చెరిగారు.