ప్రధాని మోడీ ఇప్పటికి కూడా చంద్రబాబు ని వదలట్లేదుగా…?

Tuesday, June 4th, 2019, 11:51:59 PM IST

ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికి కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని వదలడం లేదని తెలుస్తుంది,. ఇప్పటికి కూడా చంద్రబాబు పై మోడీ కొన్ని సంచలనమైన వాఖ్యకు చేశారు…. తమకి విభేదాలు రాడానికి కారణం కేవలం ప్రత్యేక హోదా అంశం అని మోడీ ప్రస్తావించారు. అందుకోసమనే చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుండి బయటకు వచ్చాడని మోడీ అన్నారు. ఎన్డీయే నుండి బయటకు రావడమే కాకుండా చంద్రబాబు, మోడీపై చాలా విమర్శలు చేస్తూ వ్యతిరేకించాడు. ఇటీవల ఏపీలో తిరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా మోడీ ని వదిలిపెట్టేది లేదని చంద్రబాబు నాయుడు చాలా ఘాటు వాఖ్యలు చేశారు…

కానీ ఈసారి చంద్రబాబు ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనంతగా ఓటమి పాలయ్యాడు. కానీ మోడీ మాత్రం అధిక మెజారిటీతో మళ్ళీ ప్రధాని అయ్యాడు… కానీ ఇదంతా కాకుండా చంద్రబాబు ఇండియా నుండి బయటకు రాడానికి మరొక బలమైన కారణం ఉందని మోడీ తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించాడని సమాచారం. అయితే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కావాలని చాలా చేసుకున్నారని, ఆ దిశగా పలు ప్రయత్నాలు చేశారని, అందుకనే చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని, ఎలాగైనా దేశంలో బీజేపీ కి వ్యతిరేకత పెంచి, ప్రజలందరిలో బీజేపీ ని అణగదొక్కాలని చంద్రబాబు ప్రయత్నించారని అన్నారు… అందుకని చంద్రబాబు ఇలా ఎన్డీయే ని వదిలాడని వార్తలు వస్తున్నాయి.