జగన్ కి నో… చందబ్రాబు కి ఎస్… చెప్పిన మోడీ…

Monday, July 22nd, 2019, 11:48:41 PM IST

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటినుండి కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. ఎలాగైనా సరే చంద్రబాబుఅవినీతిని బట్టబయలు చేయాలని జగన్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకు గాను పీపీఏల పై సమీక్ష, పోలవరం, అమరావతి టెండర్ల విషయంలో రీ టెండర్లు, కరకట్ట నివాసాలు కూల్చడం ఇవన్నీ కూడా జగన్ కావాలనే చేస్తున్నాడు. ఇలా జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవేమి కూడా చంద్రబాబుని గట్టిగ పట్టి ఉంచడం లేదు అంటే సరైన ఆధారాలేవీ కూడా దొరకడం లేదని చెప్పాలి. అయితే ఎలాగైనా చంద్రబాబు ని ఇరకాటంలో పెట్టాలని జగన్ ఈసారి కొత్త ప్లాన్ అమలు చేయనున్నాడు. ఎలాగైనా పోలవరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నాడు.

అందుకనే పోలవరం అవినీతిపై కేంద్రంతో దర్యాప్తు చేయించాలని విజయసాయిరెడ్డితో రాజ్యసభలో విజ్ఞప్తి చేయించారు. ఈమేరకు రాజ్యసభలో మాట్లాదిన ఎంపీ విజయసాయి రెడ్డి… పోలవరం నిర్మాణంలో 2014 నుండి 2019 వరకూ చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనీ, దానిపై సిబిఐ విచారణ జరిపిస్తేనే అన్ని నిజానిజాలు బయటకు వస్తాయని విజయసాయిరెడ్డి అన్నారు. అయితే ఆ వాఖ్యాలను కేంద్రం పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించడం లేదు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్… పోలవరంపై అవినీతి జరిగినట్లు ఇంతవరకు కూడా తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, అందుకని పోలవరం పై సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం లేదని షెకావత్ అన్నారు. అయితే ఈ నిర్ణయంతో వైసీపీ నేతలు అందరు కూడా అసంతృప్తికి గురైనప్పటికీ కూడా, టీడీపీ అధినేత మాత్రం హ్యాపీగా ఉన్నారని సమాచారం.