ట్రంప్ తో ఫోన్ మాట్లాడిన మోడీ – చర్చ అందుకేనా…?

Tuesday, August 20th, 2019, 03:00:14 AM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో కొద్దీ సేపు ఫోనులో చర్చలు జరిపారు. దాదాపుగా 30 నిముషాలపాటు సాగిన వీరి సంభాషణలో భాగంగా ముక్జ్యమంగా కశ్మీర్‌ వ్యవహారంపై ప్రధాని మోడీ, ట్రంప్‌తో తీవ్రంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ తో పాటు మరికొందరు నేతలు భారత్‌కు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నారని పాకిస్తాన్‌ను ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జూన్‌ నెలాఖరులో ఒసాకాలో జరిగిన జీ20 సదస్సులో రెండు దేశాలకు మధ్యన వచ్చినటువంటి చర్చలను కూడా ప్రధాని మోడీ ట్రంప్ కి వివరించారు. వీటితోపాటు రెండు దేశాల మధ్యన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు.

ఐటీ ట్రంప్‌, మోదీల మధ్య సంభాషణ చాలా స్నేహపూర్వకంగా జరిగిందని, ప్రధాని కార్యాలయం ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. కాగా కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకించిన పాకిస్థాన్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తో సంప్రదించారు. కాగా ఈ విషయంపై వీరిరువురు కూడా ఫోనులో చర్చలు జరిపారని సమాచారం.