తరువాతి టార్గెట్ సెట్ చేసుకున్న మోడీ..!!

Sunday, November 27th, 2016, 04:09:34 PM IST

modi
పాక్ పై సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన కొద్ది రోజులకే మోడీ భారత దేశం లోని అవినీతి పరులపై కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిపారు. యూరి దాడికి ప్రతీకారం మోడీ చాలా తక్కువ సమయంలోనే తీర్చుకున్నారు.కానీ 70 ఏళ్లుగా భారత దేశంలో పేరుకుపోయిన అవినీతి రాయుళ్ళపై ఏ నాయకుడు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయలేదు.మోడీ తొలిసారి దేశం లో నల్ల ధనాన్ని రూపుమాపాలన్న ఉద్దేశం తో మోడీ పెద్ద నోట్లని రద్దు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.మోడీ తీసుకున్న ఈ నిర్ణయం వలన భారత ఆర్ధిక వ్యవస్థకు ఎంత మొత్తం లో మేలు జరగబోతోందనే లెక్కలు తేలాలంటే ఇనక కొన్ని రోజులు గడవాలి.మోడీ నిర్ణయం వలన ప్రయోజంనం సంగతి అటుంచితే సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాత్రం అన్ని ఇన్ని కావు.మోడీ నిర్ణయం వలన సామాన్యులు జనజీవనం స్థంబించిపోతోందని విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. మరికొందరు పిచ్చి తుగ్లక్ లాగా నిర్ణయం తీసుకుని మోడీ దేశ ఆర్ధిక వ్యవస్థని ఛిన్నాభిన్నం చేశారని మరికొందఋ ఆరోపిస్తున్నారు.

ఇలాంటి విమర్శలన్నింటికీ మోడీ వెనక్కి తగ్గినట్లు లేదు. విపక్షాల అరుపులకు మోడీ లో ఎదురు బెదురూ కనిపించడం లేదు. మోడీ తదుపరి తన అస్త్రాన్ని సంధించబోయో టార్గెట్ ని ముందే బయట పెట్టేసారు. తన తదుపరి అస్త్రాన్ని బినామీల పైనే ప్రయోగిస్తాన్నని మోడీ చెప్పేసారు. దేశ చరిత్ర లోనే అత్యంత కఠినమైన బినామీ చట్టాన్ని తెస్తామని మోడీ ప్రకటించారు. ఈ అంశం ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉందని త్వరలో దీనిని తీసుకురావడానికి ప్రయత్నిస్తామని మోడీ అన్నారు. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న బినామీ రాయుళ్ల వెన్నులో వణుకు పుడుతోంది.ఈ చట్టానికి ఒక్కసారి పట్టుబడితే తీవ్రమైన శిక్షలను ఎదుర్కోవలసి ఉంటుందనికూడా మోడీ హెచ్చరించారు. దేశవ్యాప్తంగా నల్లధనం డబ్బు రూపం లోకన్నా బినామీ ఆస్తుల రూపం లో ఎక్కుగా ఉంటుందనేది ఆర్ధిక నిపుణుల అంచనా. బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులూ వారి నల్ల ధనాన్ని ఎక్కువగా బినామీ రూపం లోనే దాచుకుని ఉంటారనే అనుమానాలు ఉన్నాయి.

భారత ఆర్ధిక వ్యవస్థని ప్రభావితం చేసే నిర్ణయం తీసుకోవడం అంటే ఒక దేశం పై యుద్ధం ప్రకటిచడం కంటే కూడా కఠిన మైన నిర్ణయం అనేది ఆర్థిక నిపుణుల అంచనా. ఈ నేపథ్యం లో మోడీ అలాంటి నిర్ణయాన్ని ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు రూపం లో తీసుకున్నారు. దీనిపర్యవసానం ఏంటనేది తెలియాలంటే ఇంకా కొద్దిరోజులు ఆగాల్సిందే అని నిపుణులు అంటున్నారు. ఈ లోగా మరో బాంబు పేల్చి తానూ దేనికి బెదరబోననే సంకేతాలని ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల పడుతున్న ఇబ్బందుల విషయం లో ప్రతి పక్షాలు మోడీ ని ఏకిపారేస్తున్నాయి. ఈ సమయం లో పెద్ద నోట్ల రద్దు అంశాన్ని విజయవంతంగా పూర్తి చేయడం పైనే మోడీ ద్రుష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. కఠిన మైన బినామీ చట్టాలను తీసుకువస్తానని అంటున్న మోడీ అది అంత సులువైన విషయం కాదని అంటున్నారు.