బిగ్ న్యూస్: ఈరోజు రాత్రి జాతి నుద్దేశించి కీలక ప్రసంగం ఇవ్వనున్న మోడీ…కేసీఆర్ కూడా..!

Tuesday, March 24th, 2020, 12:24:16 PM IST

భారత్ లో కరోనా వైరస్ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం ఇవ్వనున్నారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు మూడు ప్రజల ముందుకు రానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తగు సూచనలు చేయనున్నారు. అయితే ఇప్పటికే మోడీ చెప్పినట్లుగా ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతం అవడంతో సోమవారం నుండి పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ విషయంలో మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు రోడ్ల మీద తిరగడం తో మోడీ మరొకసారి కీలక వ్యాఖ్యలు చేయనున్నారు. ఈ ప్రసంగంలో కరోనా వైరస్ నివారణకు తగు సూచనలు చేయనున్నారు.

ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ప్రగతి భవన్ లో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి నీ నివారించేందుకు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.