జగన్ ప్రశ్నలకు మూగబోయిన మోడీ నోటి మాట

Sunday, June 16th, 2019, 03:01:16 AM IST

మనదేశానికి రెండవసారి ప్రధాని అయిన నరేంద్ర మోడీకి కొంత దూకుడు స్వభావం ఎక్కువని అందరు అంటుంటారు… మోడీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఇక ఎవరి మాట లెక్కచేయడని, ఎవ్వరు చెప్పిన కూడా వినడని, అంతేకాకుండా మోడీ తీసుకున్న నిర్ణయాలు మార్చడం ఎవ్వరి వల్ల కాదని, తనకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా మాట కూడా వినడని అంటుంటారు తన సన్నిహిత బృందం. ఎందుకంటే తాను అంత పద్దతిగా మరియు నిజాయితీగా పనిచేస్తాడని ఇప్పటికే మంచి పేరు ఉంది. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న మోడీని ఇక ఎవరుకూడా వేలెత్తి చూపలేరని, అంత సాహసం కూడా ఎవరు చేయరని అంటున్నారు రాజకీయ పండితులు…

కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోడీ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ సమయంలో మోడీ నోటా మాట కూడా రానంతగా ప్రశ్నలను సంధించారు జగన్. నీతి ఆయోగ్ సదస్సులో చాన్స్ దొరికిందే చాలు అన్నట్లు హోదా ఎందుకు ఇవ్వరంటూ దేశంలోని సీఎం లు మొత్తం చూస్తుండగా మోడీకి కడిగేసినంత పని చేశారు జగన్. మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు, దానికి మేము అర్హులం కాదా అని జగన్ ప్రశ్నించడంతో మోడీ ఆలా నివ్వెరపోయి మరీ చూస్తుండిపోయాడు. ప్రధాని ని ఆలా ఎదురించి మాట్లాడింది అప్పట్లో ఇందిరాగాంధీ, తరువాత అంతటి పేరు తెచ్చుకున్నది మళ్ళీ ఈ యువ సీఎం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా మాకు ఈసారి ప్రత్యేక హోదా కావాల్సిందేనని జగన్ భీష్మించుకు కూర్చున్నాడు. కాగా ఈ యుద్ధంలో గెలుపెవరిదో తెలియాల్సి ఉంది…