మరికొద్దిసేపట్లో ప్రధాని మోడీ దేశ ప్రజలకు మోడీ ఏం చెప్పబోతున్నారు….?

Saturday, December 31st, 2016, 08:28:25 PM IST

modi
పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకునేటప్పుడు మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు తరువాత ఆయన పాల్గొన్న ప్రతి బహిరంగ సభలోను ఆయన తనకు 50 రోజులు సమయం కావాలని ఆ తరువాత సమస్యలన్నీ తగ్గుతాయని ప్రజలను కోరారు. ఆయన కోరిన 50 రోజులు పూర్తి అయిపోయాయి. ముఖ్యంగా 1000, 500 రూపాయల నోట్లు బ్యాంకులలో డిపాజిట్ చేయడానికి డిసెంబర్ 30తో గడువు ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు రాత్రి 7:30 నిముషాలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ఏం మాట్లాడతారో అని దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు ప్రధానమంత్రి కీలక ప్రసంగం చేయనున్నారని కొద్ది రోజులనుండి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ దీని మీద ఒక స్పష్టత ఇచ్చింది. పెద్దనోట్ల రద్దు తరువాత చేపట్టబోయే సంస్కరణల గురించి మోడీ మాట్లాడవచ్చని అంటున్నారు. ఇంకా… నగదు సమస్యను ఏ విధంగా పరిష్కరించింది, కొత్త నోట్లను ఏ విధంగా చలామణిలోకి తీసుకొచ్చింది లాంటి అంశాలు మాట్లాడతారని చెప్తున్నారు. నోట్ల రద్దు తరువాత ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారో కూడా మోడీ చెప్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments