బాక్స్ ఆఫీస్ కలక్షన్ల పై మోహన్ బాబు చురకలు ?

Saturday, September 17th, 2016, 11:44:55 PM IST

mohan-babu
ఒక సినిమా నిజంగా ఆడిందా … కావాలని ఆడించారా అనే విషయం సినిమా విడుదలైన మొదటి వారంలో తెలిసిపోతుంది. ఎలాగూ విడుదల రోజు, రెండో సినిమా క్రేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని అంచనా వేయలేం? ఇక ఈ మధ్య చాలా మంది దర్శక నిర్మాతలు తమ సినిమా ఇన్ని కోట్లు వసూలు చేసింది, అన్ని కోట్లు వసూలు చేసిందంటూ ప్రమోషన్లో డబ్బాలు కొట్టుకుంటూ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజ్ చేసే విషయంలో వారిని వారే మోసం చేసుకుంటున్నారన్నది అక్షర సత్యం ? నిజానికి ఓకే సినిమాకు వస్తున్న అసలు కలక్షన్స్ ఏమిటి ? అనేది తెలుసుకుంటే బెటర్. ఈ విషయం పై ప్రముఖ నటుడు మోహన్ బాబు ఫైర్ అయ్యాడు? ఈ రోజుల్లో సినిమా బడ్జెట్ బాగా పెరగడానికి నిర్మాతలే కారణం అని అంటున్నాడు, అంతే కాదు యాభై లక్షలిచ్చే దర్శకుడికి ఒక్క హిట్ పడగానే … అతని వెంట పడి రెండు మూడు కోట్లు ఇస్తున్నారు, ఇక హీరోలకైతే లెక్కే లేదు. ఇప్పుడు నిర్మాత పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది అని మండిపడ్డాడు. ఈ విషయం పై నిర్మాతలు నిక్కచ్చిగా ఆలోచించాలని, దీనిద్వారా నష్టపోయేది కూడా ఆ నిర్మాతే అని చెప్పాడు. మోహన్ బాబు మాటలు చాలా మంది నిర్మాతలకు కచ్చితంగా అబ్బుతుంది. మరి ఈ ఫేక్ కలక్షన్స్ ను ఎందుకు అంత హైలెట్ చేస్తున్నారో వారికే తెలియాలి ?