టీజర్ టాక్ : అక్కడ వాళ్లు దేవుళ్లైతే ఇక్కడ నేనూ దేవుడ్నే

Saturday, January 13th, 2018, 05:23:10 PM IST

చాలా కాలం తరువాత సీనియర్ నటుడు మోహన్ బాబు ఒక మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ నలుగురు – పెళ్ళైన కొత్తలో వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గాయత్రీ సినిమా లో మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఆ సినిమాకు సంబందించిన టీజర్ ని చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేసింది. మోహన్ బాబు తన డైలాగ్ డెలివరీ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచారని అనిపిస్తుంది.

‘రామాయణంలో రాముడికి, రావణాసురుడికి మధ్య గొడవ. మహాభారతంలో పాండవులకు, కౌరవులకు మాత్రమే గొడవ. వాళ్లూ వాళ్లూ కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయి ఉంటే బాగుండేది. కానీ, వాళ్ల మూలంగా జరిగిన యుద్ధంలో అటు, ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్లు చేసింది తప్పయితే ఇక్కడ నేను చేసింది కూడా తప్పే. అక్కడ వాళ్లు దేవుళ్లైతే ఇక్కడ నేనూ దేవుడ్నే. అర్థం చేసుకుంటారో, అపార్థం చేసుకుంటారో.. ఛాయిస్‌ ఈజ్‌ యువర్స్‌’ అంటూ ఆయన చెప్పిన విధానం విజిల్స్ వేయించేలా ఉంది. ఇక సినిమాలో మంచు విష్ణు కూడా నటిస్తున్నాడు. శ్రియ – అనసూయ మరో పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.