ఆవిడ‌ని చూసి లొట్ట‌లేసుకున్నాడుట‌!

Sunday, September 18th, 2016, 01:05:41 AM IST

mohababu-speach
మోహ‌న్‌బాబు 40 సంవ‌త్స‌రాల కెరీర్ ఉత్స‌వం ఎంబి-40 పేరుతో వైజాగ్‌లో గ్రాండ్ గా జ‌రిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక‌ల‌కు మోహ‌న్‌బాబు నాయిక‌లు జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ ఎటెండ్ అయ్యారు. వారిని ఉద్ధేశించి మోహ‌న్‌బాబు మాట్లాడుతూ ఎమోష‌న్ అదుపుత‌ప్పారు. జ‌య‌సుధ రియ‌ల్ లైఫ్‌లో చెల్లెలుతో స‌మానం అని వ‌ర్ణించిన మోహ‌న్‌బాబు నేను అసిస్టెంట్‌గా చేసేప్పుడే త‌ను హీరోయిన్‌. త‌న‌తో హీరోగా చేశా. జ‌య‌సుధ నిజ‌జీవితంలో నాకు చెల్లెలు. త‌ను న‌టించే సినిమాకి 300 జీతం అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశా. త‌న స‌ర‌స‌న నేను హీరోగా చేశానంటే అది భ‌గ‌వంతుడి ఆశీస్సులు. జ‌య‌సుధది మా తిరుప‌తే, శ్రీ‌దేవి మా తిరుప‌తే. .. అంటూ చెప్పుకొచ్చారు. ఇక జ‌య‌ప్ర‌ద గురించి మాట్లాడుతూ .. “నా భార్య ఉంది కానీ అప్పుడ‌ప్పుడు లొట్ట‌లేసుకుంటాను!“ అంటూ త‌న అందాన్ని పొగిడేశారు కాస్త ఆడ్‌గానే.